22-11-2025 04:49:21 PM
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా చర్యలు...
గ్రామ గ్రామాన ఇందిరమ్మచీరల పంపిణీ కార్యక్రమం:
ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డి
వనపర్తి టౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని, మహిళా ఆర్థిక స్వావలంబనను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలలో మహిళలను భాగస్వామ్యం చేస్తుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి జంగమయ్యపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పనులు చేపట్టిందన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు, ఆదర్శ పాఠశాలలో మహిళా అధ్యక్షురాలు, పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టడం, ఆర్టిసి బస్సుల కొనుగోలులో మహిళా సమాఖ్యల భాగస్వామ్యం, వడ్డీ లేని రుణాలు, విద్యార్థులకు వసతి మెస్ చార్జీల పెంపు లాంటి అనేక పథకాలను మహిళలకు ఉపయోగపడే విధంగా అనునిత్యం మహిళా అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఈ క్రమంలోనే ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రం లోని కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు.సొంత కూతురికి, సొంత చెల్లెలికి విలువ ఇవ్వకుండా మాట్లాడే బిఆర్ఎస్ నాయకులు నేడు నీతులు వల్లించడం విడ్డూరమన్నారు.పదేళ్ల కాలంలో మహిళలను పట్టించుకోని పట్టించుకోని నాయకులు నేడు గ్రామాల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచే అభ్యర్థులను గెలిపించి తనకు బలంగా నిలవాలని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి సులభం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు.
ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే వారు అభివృద్ధికి ఆటంకాలుగా మిగులుతారని ఏ ఒక్కరికి అవకాశం ఇవ్వకూడదని ఆయన సూచించారు. కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, మాజీ జడ్పిటిసిలు వెంకటస్వామి, రమేష్ గౌడ్, వేణుగోపాల్, నాయకులు మణిగిల్ల తిరుపతి రెడ్డి, శ్రీశైలం యాదవ్, మహిళా సమాఖ్య సభ్యురాలు అధికారులు దళితులు పాల్గొన్నారు.