22-11-2025 04:30:58 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల లక్షెట్టిపేటలో చదువుతున్న విద్యార్థినిలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రస్థాయి అండర్ 17 కుస్తీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యారాలు కె.రమా కళ్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.... ఈనెల 4న ఇందిరా ప్రియదర్శిని స్టేడియం అదిలాబాదులో నిర్వహించిన జోనల్ స్థాయి కుస్తీ పోటీలలో లక్షెట్టిపేట గురుకుల విద్యార్థినులు జి భువనేశ్వరి, టీ అక్షర, సిహెచ్ హారిక, ఎం స్వర్ణలత, జి పావని, ఏ వర్షిత ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 23,24 న హైదరాబాద్ లోని ఖాదర్ పహీల్వన్ రేజిలింగ్ క్లబ్ బాజర్గాట్ లో నిర్వహిస్తున్నారని తెలిపారు. పీఈటీలు డి రమాదేవి,సిహెచ్ మమత. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించారు.