calender_icon.png 22 November, 2025 | 5:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు

22-11-2025 04:59:39 PM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..

కల్వకుర్తి: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు, ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రతి అర్హురాలికి చీరలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, ఎమ్మార్వో ఇబ్రహీం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.