calender_icon.png 22 November, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంటా కాక లారీలు రాక

22-11-2025 04:35:09 PM

15 రోజుల నుండి రైతుల అవస్థలు..

ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం..

సదాశివనగర్ (విజయక్రాంతి): మండలంలోని పద్మాజీవాడి సింగిల్ విండో పరిధిలో ధాన్యం కొనుగోలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు. గత 15 రోజుల నుండి ధాన్యం కంటా కాకా పోవడం వల్ల రైతులు కల్లాల వద్దనే పడిగాపులు కాస్తున్నారు. సమస్య ను సింగల్ విండో అధ్యక్షుడు దృష్టికి తీసుకెళ్తే నిర్లక్ష్యం సమాధానం చెప్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వెలల్లో మహిళ రైతులు కల్లాల వద్ద కాపలా ఉండటం ఇబ్బందిగా ఉందని, చలి తీవ్రత అధికంగా ఉండటం వలన రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి ధన్యన్ని వెంటనే తరలించే విదంగా చర్యలు తీసుకోవాలి రైతులు కోరుతున్నారు. ఈ మేరకు రైతులు పద్మాజీవాడి రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేసిన కల్లాల వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం కంటా చేసి తరలించే విధంగా చర్యలు చేపట్టాలని లేనిచో రోడ్డుపై బైటహిస్తమన్నారు.