calender_icon.png 22 November, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిపెడ మండల యాదవ సభను విజయవంతం చేయాలి

22-11-2025 04:45:51 PM

మరిపెడ మండల యాదవ సంఘం..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఈ నెల 30 ఆదివారం రోజున మరిపెడ మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మరిపెడ మండల యాదవ కుటుంభ సభను విజయవంతం చేయాలని మరిపెడ మండల యాదవ సంఘం సభ్యులు అన్నారు. మరిపెడ మండల కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో శనివారం నిర్వహించుకున్న యాదవ సన్నాహక సమావేశంలో వారు మాట్లాడుతూ అనేక సామజిక వర్గాల వారు తమ తమ కుల సంఘాలను ఏర్పాటు చేసుకొని సామజికంగా రాజయకియ పరంగా పలు వ్యపారలల్లో అనేక రకాలుగా వారు ఏర్పాటు చేసుకున్న సంఘాలతో బలంగా ఏర్పడి వారి యొక్క హక్కుల సాధనకు కృషి చేస్తున్నారని కానీ యాదవ సామజిక వర్గంలో ఎటువంటి ఐక్యత లేక పోవడంతో యాదవులకు ఎక్కడ గుర్తింపు లేకుండా పోతుంది అని ప్రతి గ్రామంలో పార్టీలలో ప్రతి ఒక్కదానిలో ఎదో ఒక దానిలో తప్పకుండా యాదవ పాత్ర వుంటుంది.

కానీ గుర్తింపు మాత్రం వుండదు ఈ రోజుల్లో గుర్తింపు వుండి బలంగా ఎవ్వరు ఐతే వుంటారో వారికే ప్రాదాన్యత వుంటుంది అని అందుకే మన యాదవ కుటుంభం బలంగా ఏర్పడాలని మనం ఎవ్వరికి తెలియని వారము కాము అని మన చరిత్ర తెలియని వ్యక్తి లేరని సామజిక కులాలలో మన యాదవ కులం అగ్రగామిగా వున్నా చరిత్ర వుందని ఇప్పుడు మనలో ఐకమత్యం లేక ఎక్కడ ఎవ్వరిని ఆశించకుండా ఎవ్వరిపనిలో వారు వుంటూ మనలో మనం పట్టించుకోకుండా వున్నాము కాబట్టే గుర్తింపు కోల్పోయామని ఇప్పటి నుండి మన గుర్తింపు, హక్కులను మనం సాదించుకోవాలని దానికోసం ప్రతి ఒక్కరు శ్రద్ద వహించి శక్తిగా ఏర్పడటానికి ఏకం కావాలని రాబోవు గ్రామ సర్పంచి ఎన్నికలు కూడా వస్తున్నాయని మనకు అవకాశం వున్నా దగ్గర వినియోగంచుకునే ప్రణాళికలు చేసుకోవాలని మనం ఎలాంటి ప్రయత్నాలు చెయ్యాలన్న మనకు ఒక గుర్తింపు ఉంటేనే మనకు అవకాశాలు వస్తాయని గమనించాలని అన్నారు.

అవకాశం మనమే సృష్టించు కోవాలని దానికి మన యాదవులు చెయ్యవలసిన ఒకే ఒక్క ఆయుధం ఐక్య మత్యం అని దానికోసం మనం పునాది వేసే కార్యక్రమానికి అందరు కృషి చేసి అన్ని గ్రామాలనుండి ప్రతి ఒక్కరు పాల్గొని విజయ వంతం చెయ్యాలని సభ స్థలం రెండు రోజుల ముందు అందరికి తెలియ జేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మండల యాదవ సంఘం సభ్యులు పలువురు పాల్గొన్నారు.