calender_icon.png 22 November, 2025 | 4:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనస్​ చెల్లింపుపై సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

22-11-2025 04:32:45 PM

సదాశివనగర్ (విజయక్రాంతి): రైతులకు సన్న వడ్ల రకానికి బోనస్ డబ్బులు చెల్లించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సదాశివనగర్ మండలం వజ్జెపల్లి తండాలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు.. అకాల వర్షం వల్ల రైతన్నలకు సరిగా దిగుబడి రాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి సన్నాలకు బోనస్​ ఇవ్వడం హర్షదాయకమన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోందని రైతులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు రమేష్, నాయకులు సర్దార్ నాయక్,భోజ్యనాయక్,సరిచంద్, రాంచంద్,బలిరామ్,ధూమనాయక్,బావుసింగ్,గోవింద్,హీరా,లాల్ సింగ్,మంగ్య,లక్ష్మణ్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు.