19 April, 2026 | 1:50 AM

బహిరంగ సభనా.. చేరిక సభనా?

19-04-2026 12:14 AM
  1. జగిత్యాలలో బీఆర్‌ఎస్ ఏ సభ నిర్వహిస్తుందో  మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు స్పష్టం చేయాలి
  2. సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకోబోం
  3. జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్

జగిత్యాల, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20న నిర్వహి స్తున్న బీఆర్‌ఎస్ పార్టీ మీటింగ్ జీవన్‌రెడ్డి చేరిక సభనా..? బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభనా..? ప్రకటించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మోతే రోడ్‌లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు నందయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సం జయ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఎక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేసుకున్నా తమ కు ఎలాంటి అభ్యంతరమూ లేదన్నారు. ఈ నెల 20వ తేదీన జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే సభపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు క్లారిటీ ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అడ్డగోలుగా అక్ర మ సంపాదన చేసిన డబ్బుతో జగిత్యాల సభ కు జన సమీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కేవలం 12వేల నుంచి 15వేల మం దితో సభ నిర్వహించుకునే స్థలంలో నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జీని నియమించి, జన సమీకరణ చేస్తున్నారని మంత్రి అన్నారు. సీనియర్ నాయకులు జీవన్‌రెడ్డి పార్టీ వీడడం బాధాకరంగా ఉందని మంత్రి అన్నారు. పార్టీ వీడుతున్న జీవన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. బీఆర్‌ఎస్ పార్టీ గొప్పగా పనిచేసిందని జీవన్‌రెడ్డి అంటున్నారని మరి బీఆర్‌ఎస్ పార్టీ గొప్పగా పనిచేస్తే 2023 ఎన్నికల్లో ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదని మంత్రి ప్రశ్నించారు. జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించడం తగదన్నారు.

రాష్ట్రంలో అర్హులైన పేదలకు రేషన్ కార్డులు ఇచ్చినందు కా..? నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నందు కా..? రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదా రులకు సన్నబియ్యం ఇస్తున్నందుకా..? ఎందు కు రేవంత్‌రెడ్డి దిగిపోవాలని జీవన్‌రెడ్డి కోరుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు. జీవన్ రెడ్డికి రాజ్యసభ పదవి, ప్రభుత్వ సలహాదారు పదవి ఇవ్వనందుకే పార్టీ మారుతున్నారని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాల సమావేశంలో అధికార పార్టీ సభ నిర్వ హణకు ఆటంకాలు కల్పిస్తున్నారన్న వార్తల్లో నిజం లేదని మంత్రి తెలిపారు.

సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తాను స్వయంగా జగిత్యాల కలెక్టర్‌కు చెప్పినట్లు మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీతో పా టు ప్రతిపక్ష పార్టీ ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరుకుంటున్నారని తెలిపారు. జీవన్‌రెడ్డిని చెల్లని రూపాయని కేటీఆర్ నాడు ఎన్నికల ప్రచారంలో మాట్లాడారని, నాడు కాంగ్రెస్ పార్టీలో చెల్లని రూపాయి నేడు బీఆర్‌ఎస్‌లో ఎట్లా చెల్లుబాటు అవుతుందని మంత్రి ప్రశ్నించారు.

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం గా ఉందని, జీవన్‌రెడ్డి పార్టీ మార్పుతో పెద్దగా నష్టం జరిగేదేమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. కొండగట్టు ఘాట్ రోడ్డు ప్రమాదంలో 60 మంది చనిపోతే పరామర్శించ డానికి రాని కేసీఆర్ జగిత్యాల జైత్రయాత్ర పేరుతో జగిత్యాల సభకు రావడం విడ్డూరంగా ఉందన్నా రు. జగిత్యాల జిల్లాలో మిగిలిపోయిన అభివృద్ధి పనులు పూర్తిచేసి, రేవంత్‌రెడ్డిని జిల్లాకు ఆహ్వానించి, జగిత్యాల జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. 

నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణంలోని రోడ్లతో పాటు ప్రధాన రహదారులు విస్తరణపై దృష్టి సారించినట్లు తెలిపారు.

మాజీమంత్రి జీవన్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యమిచ్చిందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య అన్నారు. 1985 నుంచి 2024 వరకు జగిత్యాలలో ఆయన తప్ప కాం గ్రెస్ పార్టీ బీఫామ్ కావాలని దరఖాస్తు చేసుకున్న రెండో వ్యక్తి లేడని, దీన్నిబట్టి కాంగ్రెస్ పార్టీ జీవన్‌రెడ్డికి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో అర్థం చేసుకోవాలన్నారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉందని నందయ్య తెలిపారు.