27 March, 2026 | 12:04 AM

అబద్ధాల పునాదిపై కాంగ్రెస్ ప్రభుత్వం

17-05-2024 12:49 AM

అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి వ్యతిరేకత 

మంచి పాలన అందించే సత్తా బీజేపీకే ఉంది 

ప్రేమేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి 

బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్

మునుగోడు, మే 16 : అతి తక్కువ కాలంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని, ఆ పార్టీ పుట్టుకే అబద్ధాల పునాది మీద ఉన్నదని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. ప్రజలకు మంచి పాలన అందించే సత్తా కేవలం బీజేపీకి మాత్ర మే ఉన్నదని స్పష్టంచేశారు. గురువారం నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సన్నాహక సమావేశంలో ఈటల మాట్లాడారు.

విద్యార్థి దశ నుంచి సమస్యల పరిష్కారం కోసం పోరాడిన వ్యక్తి ప్రేమేందర్‌రెడ్డి అని అన్నారు. ఎమ్మెల్సీగా ప్రేమేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.  బుద్ధిజీవులు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. అనంతరం పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడుతూ.. పట్టభద్రులు బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తర్వాత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పట్టభద్రులకు సేవ చేసే అవకాశం తనకు కల్పించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, నల్లగొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, నాయకులు మాదగోని శ్రీనివాస్, పిల్లి రామరాజు, వీరెళ్లి చంద్రశేఖర్, శ్రీదేవిరెడ్డి, నివేదితరెడ్డి తదితరులు పాల్గొన్నారు.