27 March, 2026 | 2:01 AM

పదో తరగతి ఫలితాలపై కలెక్టర్ సమీక్ష

17-05-2024 12:48 AM

వనపర్తి (గద్వాల), మే16 (విజయక్రాంతి): పదో తరగతి ఫలితాల్లో జిల్లా వెనుకబడడానికి గల కారణాలు తెలుసుకొని.. వచ్చే విద్యా సంవత్సరంలోనైనా మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ సంతోష్ విద్యాశాఖ అధికారులకు సూచించారు. పదో తరగతి ఫలితాలపై విద్యాశాఖ అధికారులతో గురువారం ఐడీఓసీ కార్యాల యంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పది ఫలితాల్లో గద్వాల జిల్లా రాష్ట్రంలో చివరి నుం చి రెండో స్థానంలో నిలవడంపై ప్రశ్నించారు. విద్యార్థులకు ఉత్తమ బోధన అందించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ.. కొన్ని పాఠశా లల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని కలెక్టర్ దృష్టికి తీసుకొ చ్చారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఇందిర, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్వేత ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.