2 March, 2026 | 3:30 AM

గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది

02-03-2026 01:51 AM

కందుకూరు,మార్చి 1 (విజయ క్రాంతి) :గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తగూడ గ్రామ శాఖ అధ్యక్షుడు బొక్క సంజీవ రెడ్డి,వార్డు సభ్యుడు సౌడపు శేఖర్ గౌడ్ లు అన్నారు.కొత్తగూడ గ్రామం లో హెచ్‌ఎండిఎ నిధుల నుండి రంగారెడ్డి జి ల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కెఎల్‌ఆర్ ల సహకారంతో మంజూరైన హైమాస్ట్ లైట్లు 6 లక్షల 50 వేల నిధులతో ఏర్పాటు చేసిన లైట్లను వారు ప్రారంభించారు.

రాజకీయాలకు సంబంధం లేకుండా గ్రామ అభివృద్ధికి కెఎల్‌ఆర్ సహకారంతో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు బొక్క భూపాల్ రెడ్డి,సీనియర్ నాయకులు ఇందిరమ్మ కమిటీ చైర్మన్ కుమారి కృష్ణయ్య, బొక్క దామోదర్ రెడ్డి,కుమ్మరి అంజయ్య, హనుమంత్ రెడ్డి,యూత్ నాయకులు బొక్క దేవేందర్ రెడ్డి,లక్ష్మీపతి గౌడ్,సురేష్ గౌడ్, రమేష్,మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.