calender_icon.png 23 January, 2026 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కక్ష సాధింపే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన

23-01-2026 11:51:31 AM

 బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్

ఖానాపూర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కక్ష సాధింపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని బి ఆర్ ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య ఝాన్సన్ నాయక్ అన్నారు. ఖానాపూర్లో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు .కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమ అక్రమాలు బయటపడతాయని, ప్రజల దృష్టి మరలచే రాజకీయాలు చేస్తున్నారని దాంట్లో భాగంగానే టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మంత్రులపై, సిట్ విచారణ, ఫోన్ టాపింగ్ కేసులంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే లేనిపోని అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఎన్ని కేసులు పెట్టి తమను వేధించిన భయపడేది లేదని ప్రశ్నిస్తూనే ఉంటామని జాన్సన్ నాయక్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. తమ నాయకుల పై విచారణ పేరుతో కాలయాపన చేస్తుందని దీంతో రాష్ట్రానికి, ప్రజలకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ట రాజకీయం చేస్తుందని అన్నారు.