calender_icon.png 23 January, 2026 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: సిట్‌ విచారణకు కేటీఆర్‌

23-01-2026 11:35:56 AM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో తమకు సంబంధం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కేటీఆర్ శుక్రవారం జూబ్లీహిల్స్‌ సిట్‌ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కేసు పెట్టారని ఆరోపించారు. సిట్ పదిసార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని చెప్పారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే కుట్రలు చేస్తున్నారని వివరించారు. విచారణకు ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.... మంత్రులతో  పాటు తమ ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలను మోసం  చేసిన సీఎంను వదిలిపెట్టామని హెచ్చరించారు. సింగరేణి స్కామ్ నుంచి డైవర్ట్ చేస్తున్నారని తెలిపారు.

రేవంత్ రెడ్డి విచారణ పేరుతోడ్రామాలు ఆడుతున్నారని వెల్లడించారు. ఉద్యమ సమయంలో ఎన్ని కేసులు పెట్టినా భయపడలేదన్న కేటీఆర్ అనుక్షణం ప్రజల కోసమే పనిచేశామని తెలిపారు. పదేళ్లు రాష్ట్రం కోసం నిబద్ధతతో పనిచేశామని సూచించారు. పొరపాటున కూడా తప్పుడు పనులు చేయలేదని వివరించారు. తాము ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగలేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను ఎప్పుడూ వేధించలేదన్నారు. ఇవ్వని హామీలను కూడా కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) నెరవేర్చారని తెలిపారు. రేవంత్ కు పాలన చేతకావడం లేదని విమర్శించారు. కాళేశ్వరం, ఫార్ములా-ఈ  పేరుతో డ్రామాలాడారని మండిపడ్డారు. రెండేళ్లుగా నాపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని తెలిపారు. డ్రగ్స్, హరోయిన్లతో సంబంధాలంటూ ప్రచారం చేశారని తెలిపారు. నా కుటుంబ సభ్యులను క్షోభకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాపింగ్ పేరుతో డైలీ సీరియల్ నడుపుతున్నారని వెల్లడించారు.

ట్యాపింగ్ జరగడం లేదని ఏ అధికారి అయినా చెప్పగలరా? ప్రశ్నించారు. నెహ్రూ హయాం నుంచి ఇప్పటివరకు గూడఛారివ్యవస్థలున్నాయని తెలిపారు. శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రతి దానిపై నిఘా ఉంటుందన్నారు. పోలీస్ నిఘా వ్యవస్థలు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయన్నారు. బొగ్గు స్కాంలో రేవంత్ రెడ్డి బావమరిది ఉన్నారని ఆరోపించారు. ఇష్టానుసారం సైట్ విజిట్ నిబంధనలు మార్చారని ద్వజమెత్తారు. కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేశారని వ్యాఖ్యానించారు. తప్పుచేసి వెంటనే దొరికిపోవడం రేవంత్ కు అలవాటన్నారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా ఉందని ఎద్దవా చేశారు. రేవంత్ కు తొత్తులుగా మారిన పోలీసులను వదిలిపెట్టనని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నేను తప్పు చేయలేదు.. ఎవరికీ భయపడనన్నారు. అవినీతిపై ప్రాణం పోయేవరకు పోరాడుతామన్నారు. కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసుకుంటామన్నారు.

గురువారం కేటీఆర్ కు జారీ చేసిన నోటీసుకు స్పందించి, శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరడంతో, అతను సిట్ ముందు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ చాలా కీలకం, ఎందుకంటే మాజీ మంత్రి టి. హరీష్ రావుతో సహా ఇప్పటివరకు సిట్ పిలిపించిన రాజకీయ నాయకులందరూ చాలా వరకు ఫోన్ ట్యాపింగ్‌కు బాధితులే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ల ట్యాపింగ్‌కు సంబంధించి తీసుకున్న నిర్ణయాలలో కేటీఆర్ ప్రమేయం ఉందా అనే కోణంలో సిట్ మొదటిసారిగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. కేటీఆర్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర భద్రత పెంచారు. హరీశ్ రావు విచారణ జరిగిన రోజు లాగే పోలీసులు భద్రత పెంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు  చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బారికేడ్లే పెట్టారు.