calender_icon.png 7 January, 2026 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్

05-01-2026 01:36:38 AM

కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం 

మోతే జనవరి 4 (విజయక్రాంతి): ఆరు గ్యారంటీల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం  మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్డు శ్రీ రామ ఫంక్షన్ హాల్‌లో  నూతనంగా ఎన్నికైన  సర్పంచులకు ఉప సర్పంచులకు వార్డు మెంబర్లకు  మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఘనంగా సన్మానం చేయడం జరిగింది.

అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అమలు కాకపోవడంతో ప్రజలు గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని అదేవిధంగా రాబోయే ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల్లో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.  ప్రజల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని  హామీలను అటుకెక్కించారని రైతు భరోసాను నిలిపివేసి రైతులను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతు భరోసాను రైతుల ఖాతాలో జమ చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో  బిర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు యాదవ్, జిల్లా నాయకులు ఏలూరు వెంకటేశ్వరరావు,  సతీష్ పాల్గొన్నారు.