calender_icon.png 7 January, 2026 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు పెడతామంటే అడ్డుకుంటాం

05-01-2026 01:38:23 AM

బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలదే

నల్గొండ టౌన్, జనవరి 4: బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బీసీలను మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీని వదిలి పెట్టేది లేదని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ అన్నారు ఆదివారం స్థానిక బీసీ విద్యార్థి సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు మున్సిపల్,ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే వేలాది మందితో రాష్ట్ర అసెంబ్లీని ముట్టడిస్తామని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతనే మున్సిపల్,ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో చర్చించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడానికి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి రాజకీయ పోరాట కార్యక్రమం ప్రకటించాలన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బిజెపి మోకాలు అడ్డుతుందని, బిజెపికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే నూతన సంవత్సరంలోనైనా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాలని ఆయన డిమాండ్ చేశారు బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రైవేట్ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టిన తర్వాత బీసీలకు అడ్డు తగిలేది ఎవరో తేలిపోనుందని, అనుకూలమైతే బీసీ బిల్లు ఆమోదమై 42 శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యా, ఉద్యోగాలు, చట్ట సభలలో కాంట్రాక్ట్ లలో 42% చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు కల్పించి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు.

లేకుంటే తెలంగాణ ఉద్యమం తరహా ప్రజలతో మమేకమై ప్రజా ఉద్యమాలతో ఉద్యమ కార్యచరణ ప్రకటించి 42% బీసీ రిజర్వేషన్లు సాధిద్దామని పిలుపు నిచ్చారు. సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేయడమే కాకుండా, ఉన్న రిజర్వేషన్ల ను తగ్గించి 17% రిజర్వేషన్లు మాత్రమే బీసీలకు ఇవ్వడం జరిగిందనీ.కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు అనుకుంటే వెంటనే బీసీ రిజర్వేషన్లు ఇవ్వొచ్చు, కానీ బిజెపి పార్టీ తనకు పట్టనట్లు, సంబంధం లేదన్నట్లు ఉంటు, బీసీలను మోసం చేస్తున్నది కాంగ్రెస్, బిజెపి పార్టీ లే అని వారు విమర్శించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ చిలక రాజు సతీష్ బీసీ జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంత్‌రాజు గౌడ కొంపల్లి మహేష్, జక్కల పృథ్విరాజ్, మహేందర్, మనీ, సాత్విక్, బాలాజీ, స్వామి, వంశీ, శివ సంతోష్, ఉదయ్ పాల్గొన్నారు.