05-01-2026 01:33:50 AM
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే..
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి) : తెలంగాణకు ద్రోహం చేసిందే.. కాంగ్రెస్ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఫజల్ అలీ కమిషన్ వద్దన్నా.. ఆంధ్రా లో కలుపడం ద్వారా తెలంగాణకు, పాలమూరుకు మరణశాసనం రాసి చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకున్నదని ధ్వజ మెత్తారు. విభజన సమయంలోనూ 11వ షెడ్యూల్లో పాలమూరు- పెట్టకుండా అన్యాయం చేశారని, తెలం గాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ -అని మండిపడ్డారు.
రేవంత్ రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పచెబుదామంటారని, కృష్ణా నదీ జలాల్లో అతి తక్కువ విని యోగం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు లోపాయికారి ఒప్పందం చేసుకుని తెలంగా ణ ప్రాజెక్టులను కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై కక్షగట్టారు.. పాలమూరుపై పగబ ట్టారు అని -ధ్వజమెత్తారు. నదీ జలాలు- కాంగ్రెస్ ద్రోహాలు అంశంపై ఆదివారం తెలంగాణ భవన్‌లో హరీశ్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్(పీపీటీ) ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాళేశ్వరంలో రెండు పిల్లర్లు కుంగితే మొత్తం కాళేశ్వరాన్ని పండబెట్టారని, రూ.100 కోట్లు ఖర్చుపెడితే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే అవకాశం ఉండేదని తెలిపారు. రెండేళ్లలో రూ. 2 కూడా కాళేశ్వరంపై ఖర్చు పెట్టలేదని, రైతాంగం, ఉత్తర తెలంగాణపై పగబట్టారని మండిపడ్డారు. మన రాష్ట్రానికి మేలు కోసం పాలమూరు ప్రాజెక్టు కట్టామని తెలిపారు. రెండేళ్ల నుంచి ప్యాకేజ్- బుడ్డ కాల్వ పూర్తి చేస్తే ఈ ఏడాది 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉండేదని, దానిని కాలరా శారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరుకు నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్, టీడీపీ ద్రోహం చేస్తే.. రేవంత్ ద్రోహాల పరంపర కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పదేళ్ల కాలంలో మేం కొత్తగా 17లక్షల ఆయకట్టు తీసుకొచ్చామని, ఎస్సారెస్పీ స్టేజ్- కాళేశ్వరం నీళ్లు అందించామని, కానీ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా, పెద్దనోట్ల రద్దు లాంటి ఆర్థిక సంక్షోభం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా తొమ్మిదిన్నరేండ్లలో 48 లక్షల 74 వేల ఎకరాల ఆయకట్టు సాధించామని, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక ఏడాదికి 57 వేల ఎకరాలు వస్తే.. బీఆర్‌ఎస్ పాలనలో ఏడాదికి లక్షా 81వేల 473 ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చామని స్పష్టం చేశారు. పదేళ్లలో కాంగ్రెస్ 93 వేల ఎకరాల స్థిరీకరిస్తే.. బీఆర్‌ఎస్ 31.50 లక్షల ఎకరాలు స్థిరీకరించామని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చెరువులను పట్టించుకోలేదని, మిషన్ కాకతీయ ద్వారా 25 లక్షల ఎకరాల ఆయకట్టు సాధించామని తెలిపారు.
ఎస్సారెస్పీ స్టేజ్ కాలువల్లో తుమ్మలు మొలిశాయి.. తప్ప నీళ్లు పారలేదని, దానికి కాళేశ్వరం నీళ్లిచ్చామని చెప్పారు. కాంగ్రెస్ పాలన కంటే బీఆర్‌ఎస్ పాలనలో అత్యధిక ఆయకట్టు సాధించామని వెల్లడించారు. అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడా రని, యావత్ శాసనసభను తప్పుదోవ పట్టించిన మీ నాలుక కోయాలా.. ఎవరి నాలుక కోయాలో చెప్పాలని ప్రశ్నించారు. చీము, నెత్తురు ఉన్నోడైతే రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనా మా చేయాలని మండిపడ్డారు.
60 ఏళ్ల కాం గ్రెస్, టీడీపీ పాలనలో.. గోదావరి నదిపై ప్రాజెక్టులకు సాధించిన హక్కులు 265 టీఎం సీలేనని, కేసీఆర్ ప్రభుత్వం గోదావరి నదిపై 383 టీఎంసీలకు హక్కులు సాధించిందని గుర్తు చేశారు. కృష్ణా నదీలోని 811 టీఎంసీల్లో 299 టీఎంసీల వాటా నికరజలాలైతే ఉమ్మడి రాష్ట్రంలో 490 టీఎంసీల ప్రాజెక్టులకు ఎలా అనుమతులు వచ్చాయని, రేవంత్ పచ్చి అబ ద్ధం చెబుతున్నారని స్పష్టం చేశారు.
ఫస్ట్ అపె క్స్ కౌన్సిల్ మీటింగ్‌లోనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించామని, పాలమూరు, డిండిని మేం కొనసాగిస్తామని కేసీఆర్ చెప్తే.. నీటి పంపిణీకి బీఆర్‌ఎస్ ఒప్పకున్నదని రేవంత్ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.
ఒక్క క్లియరెన్స్ తేలేదు.. 3 డీపీఆర్లు వాపస్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక 11 ప్రాజెక్టులకు డీపీఆర్లు పంపామని, 7 ప్రాజెక్టులకు మనం అనుమతులు సాధించగా సమ్మక్కసాగర్ ప్రాజెక్టు ఒకటి పెండింగ్‌లో ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు- డీపీఆర్, అంబేద్కర్ వార్దా డీపీఆర్, కాళేశ్వరం అడిషనల్ టీఎంసీ డీపీఆర్ వాపస్ వచ్చిందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక డీపీఆర్ పంపలేదని, ఒక్క క్లియరెన్స్ తేలేదని, కానీ 3 డీపీఆర్లు మాత్రం వాపస్ వచ్చాయని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ సక్సెట్ రేటు 63 శాతం ఉంటే కాంగ్రెస్ సక్సెట్ రేట్ -30 శాతం ఉందన్నారు.
రెండేళ్లలో రూపాయి ఇవ్వకుండా కాళేశ్వరంపై కక్షగట్టారని, పాలమూరు బిడ్డ అంటూ సొంత ప్రాంతానికే రేవంత్ ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. టెలీమెట్రీలను పెట్టాలని 2016లోనే కేసీఆర్ చెప్పారని, కానీ అవన్నీ దాచిపెట్టి సగం పేరాగ్రాఫ్‌లు మాత్రమే రేవంత్ చదివారని, మోకా లు, బోడిగుండుకు ముడిపెట్టేలా రేవంత్ మాటలున్నాయని మండిపడ్డారు.
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉద్దెర మాటలు
2024 కృష్ణానదిలో కేవలం 28.49 శాతం మాత్రమేనని, ఇంత తక్కువ స్థాయిలో నీటిని వినియోగించుకోవడం ఇదే తొలిసారి అన్నారు. ఇప్పుడు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉద్దెర మాటలు మాట్లాడుతు న్నారని విమర్శించారు. ఏడేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఎస్‌ఎల్‌బీసీలో రూ.1,358 కోట్ల తో 11.5 కి.మీ. టన్నెల్ తవ్వితే కాంగ్రెస్ రెండేళ్లలో కేవలం 18 మీటర్లు మాత్రమే తవ్విందని ఎద్దేవా చేశారు.వీళ్లు బీఆర్‌ఎస్ గురించి మాట్లాడుతారా అని ప్రశ్నించారు. టన్నెల్ పూర్తుతై డిండి, పెండ్లిపాక రిజర్వాయర్‌ల్లోకి నీళ్లు వస్తాయని తెలిపారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సగటున రోజుకు 120 టీఎంసీలను ఏపీ అక్రమంగా తరలిస్తే కాంగ్రెస్ పాలనలో 241 టీఎంసీల నీళ్లు తరలించిందని వెల్లడించారు. కాంగ్రెస్ చేతగాని తనానికి ఇది మరో నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్ పథకాలను కోసుడు.. అబద్ధాల వరద కోసుడు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. రెండేళ్లలో 11లక్షల 60 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారని, కానీ లక్ష ఎకరాలకు కూడా కాంగ్రెస్ నీళ్లు ఇవ్వలేదన్నారు.
తలకాయ ఎక్కడ పెట్టుకుంటవ్ రేవంత్‌రెడ్డి..
రేవంత్ వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఏపీ ప్రభుత్వం స్టేట్‌మెంట్ ఇచ్చిందని, రేవంత్‌రెడ్డి మాకు చెవిలో చెప్పలేదు.. మేం ఆపలేదు అని స్పష్టం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నప్పుడే బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చినట్టు వెల్లడించిందని, ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావ్ రేవంత్‌రెడ్డి అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలు, సభను తప్పుదోవ పట్టించిన రేవంత్‌రెడ్డి చెంపలేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నేరం చేసేది కాంగ్రెస్.. నెపం నెట్టేది బీఆర్‌ఎస్ మీద అని మండిపడ్డారు.
కృష్ణా నదీ జలాల విషయంలో కాంగ్రెస్ అన్యాయంపై ప్రశ్నిస్తామని, ప్రజాక్షేత్రంలో ఎంగడుతామని, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్‌ఎస్ శ్రీకారం చుడుతుందని తెలిపారు. మాకు అధికారం ముఖ్యం కాదని, తెలంగాణ ప్రజల హక్కులు ముఖ్యమని స్పష్టం చేశారు.
నాపై హత్యా ప్రయత్నం కూడా చేయించొచ్చు..
సభలో అబద్ధాలు చెప్పినందుకు రేవం త్ నాలుక కోయాలని, ఇలా మాట్లాడుతున్నందుకు నాపై దాడి చేపించొచ్చు, అవసర మైతే హత్యాయత్నం కూడా రేవంత్ చేయించవచ్చని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ ద్రోహం వల్లనే కృష్ణాలో 299 టీఎంసీలు వచ్చాయని, కానీ గోదావరిలో 933 టీఎంసీలకు మనం అనుమతులు సాధించామని తెలిపా రు.
కృష్ణాలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నిం గ్ ప్రాజెక్టులు చేసి ఆరున్నర లక్షల ఎకరాల కు నీళ్లు ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్‌ది అని స్పష్టం చేశారు. కృష్ణాలో 50:50 శాతం ఇవ్వాలని మేం 28 లేఖలు రాశామని, కేం ద్రంపై పోరాటం చేసి సెక్షన్ 3 సాధించిందే కేసీఆర్ అని గుర్తు చేశారు. 2023లోనే 66:34 శాతం లేకుండానే అగ్రిమెంట్ చేశామని, కాంగ్రెస్ వచ్చాక మళ్లీ 66:34 శాతా నికి ఒప్పుకుందన్నారు. సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ జరగనుందని, ఐదారు నెలల్లో 500 టీఎంసీలు రాబోతున్నాయని వెల్లడించారు.
తెలంగాణ ఏర్పడ్డాక 42 రోజుల్లోనే కృష్ణాలో 69 శాతం నీళ్లు రావాలని కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు నికరజలాలు కేటాయించకపోవడం వల్లే తెలంగాణకు అన్యా యం జరిగిందన్నారు. కృష్ణాలో మనకు 600 టీఎంసీలు రావడానికి ఆనాడు తెలంగాణ రాష్ట్రం తెచ్చి ఎంత మేలు చేశారో, సెక్షన్ -3 సాధించి తెలంగాణకు అంత మేలు చేసిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు బీఆర్‌ఎస్‌పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.