calender_icon.png 18 November, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్ జరిగే రాష్ట్రాల నేతలతో కాంగ్రెస్ మీటింగ్

18-11-2025 03:07:32 PM

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ తన ఓటర్ బేస్ ను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మంగళవారం ఢిల్లీలోని ఇందిరా భవన్ లో ముఖ్యనేతలతో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఎఐసీసీ అధ్యక్షుడు మల్లీకార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) రెండో విడత ప్రక్రియ జరుగుతున్న రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎఐసీసీ జనరల్ సెక్రటరీలు, ఎఐసీసీ ఇన్-చార్జ్‌లు, పీసీసీలు , సీఎల్పీలు, ఎఐసీసీ సెక్రటరీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ... ఓటర్ల జాబితా సమగ్రతను కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ నిస్సందేహంగా కట్టుబడి ఉందని, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల విశ్వాసం ఇప్పటికే దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఈ సర్ ప్రక్రియ సమయంలో ఎన్నికల సంఘం ప్రవర్తన తీవ్ర నిరాశపరిచిందన్నారు. సర్ సర్వే బీజేపీ నీడలో పనిచేయడం లేదని, ఏ పాలక పార్టీకి కాదని, భారత ప్రజలకు చేసిన రాజ్యాంగ ప్రమాణం, విధేయతను గుర్తుంచుకునేల పనిచేయలని సూచించారు. ఓటు చోరీ కోసం బీజేపీ సర్ ప్రక్రియను ఆయుధంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోందని తాము గట్టిగా నమ్ముతున్నామని తెలిపారు.

సర్ ప్రక్రియపై కాంగ్రెస్ కార్యకర్తలు, బీఎస్ఓలు, జిల్లా/నగరం/బ్లాక్ అధ్యక్షులు అవిశ్రాంతంగా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నిజమైన ఓటర్లను తొలగించడానికి, నకిలీ ఓటర్లను చేర్చడానికి చేసే ప్రతి ప్రయత్నాన్ని తాము బహిర్గతం చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఖర్గే హెచ్చరించారు. పార్టీల పక్షపాత దుర్వినియోగం ద్వారా ప్రజాస్వామ్య రక్షణలు క్షీణించడాన్ని కాంగ్రెస్ పార్టీ అనుమతించదని మల్లీకార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియతో పాటు వచ్చే ఏడాది(2026) అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఓటర్ రిజిస్ట్రేషన్ ను పెంచడం, ఓటర్ లిస్ట్ డ్రాప్ట్ పై క్లెయిమ్స్, అభ్యంతరాలు వంటి అంశాలపై నేతలు చర్చించారు. భవిష్యత్ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలను రూపొందిచినట్లు సమాచారం.