calender_icon.png 18 November, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన దేవరకొండ ఎమ్మెల్యే

18-11-2025 03:50:23 PM

దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్, షాది ముబారక్, కళ్యాణలక్ష్మి చెక్కులను  మంగళ వారం దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మొత్తం 250 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 1 కోటి 18 లక్షల రూపాయల చెక్కులు, అలాగే షాది ముబారక్ మరియు కళ్యాణలక్ష్మి పథకాల కింద రూ. 75 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూప్రజా ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిర్బంధంగా చేరాలనే దృష్టితో ప్రజల కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని తెలిపారు.