calender_icon.png 18 November, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడిగా దిగోజు వెంకటాచారి నియామకం

18-11-2025 04:10:58 PM

నకిరేకల్,(విజయక్రాంతి): బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నకిరేకల్ మండల యూత్ అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన దిగోజు వెంకటాచారిని నియమించారు. మంగళవారం నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి రోడ్ లో ఆ సంఘం సమావేశం నిర్వహించారు. ​ఈ మేరకు ఆ అసోసియేషన్  రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరూరి వెంకటేశ్వర్లు దిగోజు వెంకటాచారికి నియామాక పత్రం అందజేశారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వెంకటాచారి మాట్లాడుతూ... బీసీ హక్కుల కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

యువజన సమస్యల పరిష్కారం కోసం పోరాటాల రూపొందిస్తామని పేర్కొన్నారు. బీసీలందర్నీ  ఐక్యం చేసి తమకు దక్కాల్సిన ఉద్యోగాలలో, రిజర్వేషన్లలో వాటాల కోసం ఉద్యమించేందుకు తన వంతు కృషి చేస్తానని అయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని  ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీసంఘం నాయకులు. తిరుగుడు రవి, మేడిపల్లి సైదులు,గోగికర్ పరమేష్ నితిన్ మహేంద్ర,వేమవరపు ప్రవీణ్, మోపూరిచంద్రమౌళి, గడగోజు నర్సింహా చారి, గడగోజు విశ్వజ్ఞాచారి, పగిడోజు మహేంద్ర చారి, నాగాచారి ,బ్రహ్మచారి, విజయ్ ,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.