18-11-2025 03:58:56 PM
కేంద్రమంత్రిని కోరిన మాజీ మేయర్
కరీంనగర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు త్వరగా నిర్వహించేలా చూడాలని బీజేపీ నాయకులు కరీంనగర్ నగరపాలక సంస్థ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహార్ లాల్ ఖట్టర్ ను కోరారు. మంగళవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి మనోహార్ లాల్ ఖట్టర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు ఆద్వర్యంలో
మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపారు. పలు అంశాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు....కరీంనగర్ నగరపాలక సంస్థ సమస్యలతో పాటు కుంటుపడ్డ నగర అభివృద్ధి, 15 ఫైనాన్స్ నిధులు, డంపుయార్డు ప్రక్షాలనకు నిధుల విడుదల, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ తదితర అంశాల పై మనోహార్ లాల్ ఖట్టర్ కు వివరించి వీటి పరిష్కారం కొసం కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి నగరపాలక సంస్థ అభివృద్ధి కి ఎలాంటి నిధులు రాక అభివృద్ధి కార్యక్రమాలు జరగక నగర ప్రజలు ఇబ్బందులకు గురౌతున్నారని వివరించినట్లు తెలిపారు.