calender_icon.png 5 July, 2025 | 9:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకే కాంగ్రెస్ సభ

05-07-2025 01:06:19 AM

  1. తెలంగాణలో దోచుకునేందుకు ఇంకేం మిగిలింది!
  2. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు

హైదరాబాద్, జూలై 4(విజయక్రాంతి): ప్రజలను మభ్యపెట్టే నినాదాలను పదేపదే వల్లవేసే కాంగ్రెస్ పార్టీ.. తన నినాదాలకు విరుద్ధంగా పనిచేయడమే అలవాటుగా చేసుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. సామాజిక న్యాయానికి తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్.. ‘సామాజిక న్యాయ సమరభేరి’ అంటూ మరోసారి తెలంగాణ ప్రజలను మాయచేయాలని చూస్తోందని శుక్రవారం ఒక ప్రక టనలో ఆరోపించారు.

ఏడాదిన్నర పాలనలో ఒక్క హామీని కూడా సమర్థంగా అమ లు చేయలేకపోయిన ప్రభుత్వం.. ప్రజలకు ఏం సమాధానం చెబుతుందన్నారు. ‘జై బా పు’ అంటూ నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, గాంధీజీ కలల గ్రామ స్వరాజ్యాన్ని నిర్వీ ర్యం చేసిందని విమర్శించారు. రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం, గ్రామాభివృద్ధి పనుల బిల్లులకు రూ.1,200 కోట్లు పెండింగ్‌లో పెట్టడం ఇవన్నీ గాంధీజీ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.

‘జై భీమ్’ అంటూ నినదిస్తున్న కాంగ్రెస్.. వాస్తవంగా లగచర్లలో గిరిజనుల భూములు లా క్కొని, పోడు భూములపై బుల్డోజర్లు పంపి, ఎస్టీ రైతులపై కేసులు బనాయించి, గురుకులాల మూసివేతలతో దుర్మార్గంగా వ్యవ హరించిందన్నారు. ‘జై సంవిధాన్’ అని ప లికే ముందు హస్తం పార్టీ తన చరిత్రను గ మనించాలన్నారు. 1975లో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన పా ర్టీకి రాజ్యాంగంపై బోధనలు చెప్పే అర్హత లేదన్నారు.

ఇవన్నీ మరిచినట్టుగా మల్లికార్జున ఖర్గే తెలంగాణకు వచ్చారని విమ ర్శించారు. ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకొని సభ నిర్వహిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. తెలంగాణలో ఇంకా దోచుకోవడానికి ఏం మిగిలిందని ప్రశ్నించారు. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తెలంగా ణ... ఈ మూడు రాష్ట్రాలూ కాంగ్రెస్ దోపిడీకి అక్షయపాత్రలుగా మారాయన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలు, 13 హామీలు అంటూ భారీగా హడావుడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..

ఇప్పటివరకు ఏ హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయిందన్నా రు. ముస్లింలను బీసీ కోటాలో చేర్చడమే కాంగ్రెస్ సామాజిక న్యాయమా అని ఎండగట్టారు. కాంగ్రెస్ హామీలు మాటలకే పరిమి తమైపోయాయని.. మాయ నినాదాలతో ప్రజలను మోసం చేయడమే ఈ ప్రభుత్వ ధోరణి అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఈ సభ నిర్వహించేది సామాజిక న్యాయం కోసం కాదని.. సామాజిక న్యాయానికి తూట్లు పొడవడానికేనని తెలిపారు.