calender_icon.png 2 August, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలపై కాంగ్రెస్ కపట ప్రేమ

02-08-2025 01:22:32 AM

శాసనమండలి సభాపక్ష నేత మధుసూదనాచారి

కరీంనగర్, ఆగస్టు 1 (విజయ క్రాంతి): బీసీ రిజర్వేషన్ విషయంలో బీసీలపై కాంగ్రె స్ పార్టీ కపట ప్రేమ చూపుతుందని శాసనమండలి సభా పక్ష నేత ఎమ్మెల్సీ మధుసూ దనాచారి తెలిపారు. శుక్రవారం చింతకుంట లోని బిఆర్‌ఎస్ భవన్ లో బిఆర్‌ఎస్ పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 8న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడంలో భా గంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆ ధ్వర్యంలో కరీంనగర్ లోని సర్కస్ గ్రౌండ్లో సభను నిర్వహించనున్నట్లు తెలిపారు.

తాను అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కు చట్టబద్ధత కల్పించడంతోపాటు నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల స మయంలో హామీ ఇచ్చారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని తుంగల తొక్కారని అన్నారు. కాంగ్రెస్ హై కమాండ్ కూడా రేవంత్ రెడ్డి తానా అంటే తందానా అన్న చందంగా వ్యవహరిస్తుందని అన్నారు.

తమిళనాడు తరహాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్టు తీర్మానం చేసి ఢిల్లీకి వెళ్లాలని ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తాము మద్దతుగా నిలుస్తామన్నారు. అంతేకాకుండా ఈ అంశాన్ని షె డ్యూల్ నెంబర్ 9లో చేర్చాలన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మా ట్లాడుతూ బీసీ రిజర్వేషన్ ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ వెంటపడతామన్నారు.

బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్ అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానీదే అన్నారు. అనంతరం స భ స్థలాన్ని పరిశీలించారు. బిఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవి రామకృష్ణ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ శాస న మండలి చైర్మన్ స్వామి గౌడ్, మాజీ మం త్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎం ఎల్ ఏ సంజయ్ , మాజీ ఎం ఎల్ ఏ లు ర సమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, దాస రి మనోహర్ రెడ్డి , పుట్ట మధు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు,

ముఠా గోపాల్, నారదా సు లక్ష్మణ్ రావు, తుల ఉమా, పల్లె రవి కు మార్ గౌడ్ , దూదిమెట్ల బాలరాజ్ యాద వ్, ఆంజనేయులు గౌడ్ , కిషోర్ గౌడ్ , ఉ పేందర్, ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ లు ధ్యావ వసంత, విజయ కనుమల్ల , మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, తదితరులుపాల్గొన్నారు.