02-08-2025 01:22:04 AM
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): తమ కు ఢిల్లీలో పవర్ ఉంది కాబట్టి బనకచర్లను కట్టితీరుతామని ఏపీ మంత్రి లోకేశ్ అంటున్నా.. రాష్ర్ట ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు నిలదీశారు. లోకేశ్ వ్యాఖ్యలపై సీఎం, మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.
రేవంత్‌రెడ్డి పెదవులు మూసుకోవడం వల్లే ఏపీ సీఎం చంద్రబాబు ఆడిందే ఆట, పాడిందే పాట అన్నట్టు తయారైందన్నారు. రేవంత్‌రెడ్డి లోపాయికా రీ ఒప్పందం చేసుకొని ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణ సీఎస్ బనకచర్ల అంశం మీద చర్చకు రాబోమని కేంద్రానికి లేఖ రాస్తే.. సీఎం మాత్రం బనకచర్ల అంశం ఎజెండాలో ఉన్నప్పటికీ చ ర్చలో పాల్గొని, కమిటీ వేసేందుకు ఒప్పుకొ ని వచ్చాడని హరీశ్‌ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రెస్ ధైర్యం చూసుకొనే బనకచర్ల కట్టితీరుతామని లోకేశ్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ రోపించారు. బనకచర్లపై చంద్రబాబు బుల్డో జ్ విధానానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మౌన మే కారణమన్నారు. లోకేశ్ ప్రాజెక్ట్ కట్టి తీరుతామంటే.. రేవంత్ మాత్రం బనకచర్ల కట్ట డం లేదని అంటున్నాడన్నారు.
చంద్రబాబు కు గురుదక్షిణ చెల్లించుకొనే పనిలో పడ్డట్టు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ డూడూ బసవన్నలా గా తలూపుతున్నట్టు వ్యాఖ్యానించారు. చం ద్రబాబు, ఢిల్లీ మెప్పు కోసం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
లోకేశ్‌ది అవగాహనారాహిత్యం
ఏపీ మంత్రి లోకేశ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని, అధికారం ఉందని, మందబలం ఉందని మాట్లాడటం పొరపాటన్నారు. మిగులు జలాలు అనేవి నిజంగా ఉంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు ఏ పీ డీపీఆర్‌ను వెనక్కి తిప్పి పంపాయన్నారు. పోలవరం అథారిటీ, గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీ, పర్యావరణ సంస్థలు ఎందుకు బన కచర్ల డీపీఆర్‌ను తిరస్కరించాయని నిలదీశారు.
మిగులు జలాలు ఉన్నాయని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సముద్రంలో వృథా గా పోయే నీటినే వాడుతామని పాత పాటే పాడితే కుదరదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని, లోకేశ్‌కు వివరాలు పంపిస్తా చూసుకోవాలని సూచించారు. ఎప్పుడు తెలంగాణ ప్రాజెక్టు లు అడ్డుకోలేదని చెబుతున్న లోకేశ్.. ఈ విషయంపై తన తండ్రి చంద్రబాబును అడగాల న్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేయాలం టూ చంద్రబాబు ఏడు ఉత్తరాలు రాశాడని గుర్తుచేశారు. కాళేశ్వరానికి అవసరమైన 11 రకాల అనుమతులు తీసుకున్నామని హరీశ్ స్పష్టం చేశారు. కాళేశ్వరం మీద కుట్ర చేసి, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా ఏపీ కి తరలించాలనే కుట్ర చేస్తున్నట్టుందన్నారు.
ఏపీలో అక్రమ ప్రాజెక్టులు కట్టి కృష్ణానదిలో నీళ్లు మళ్లించినట్టు, గోదావరి నీళ్లు మళ్లించాలనేది పెద్ద కుట్ర అని ఆరోపించారు. రెండు నదులను హస్తగతం చేసుకొనే కుట్రలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ కాళేశ్వరం కో సం మహారాష్ర్టకు వెళ్లి గవర్నర్, సీఎంను కలిసి ఒప్పించి, మెప్పించారని గుర్తుచేశారు.
బనకచర్లను అడ్డుకొని తీరుతాం
సమైక్య రాష్ట్రంలో ఉన్నపుడు 968 టీఎంసీలను తెలంగాణకు వాటాగా కేటాయిం చా రని.. ఇందుకు లోబడి కడుతున్న ప్రాజెక్టుల ను ఎందుకు ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీ లో ఇచ్చిన 968 టీఎంసీల పరిధిలో కట్టిన ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ఏపీ.. బనకచర్ల ఎలా కడుతుందని ప్రశ్నించారు. 968 టీఎంసీల నిబంధనను అంగీకరించాల్సిందేనని లోకేశ్‌కు సూచించారు.
దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్రానికి రాసిన లేఖలను ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. గోదావరి నీళ్లు కృ ష్ణాకు మళ్లిస్తే ట్రిబ్యునల్ నిబంధనల ప్రకా రం ఇవ్వాల్సిన 155 టిఎంసీలు తెలంగాణకు ఇస్తామని ఒప్పుకోవాలన్నారు. 1,480 టీ ఎంసీల కంటే ఎక్కువగా ఉన్న నీటిని 65:35 ప్రకారం వాటా లెక్క తేల్చాలన్నారు. కేసీఆర్.. చంద్రబాబు, జగన్‌లను కలిసి మిగులు జలాల్లో వాటా ఉపయోగించుకొని, రెండు రాష్ట్రాలకు వాడుకుందామని చెప్పారని.. కానీ ప్రస్తుతం ఏపీ చేస్తున్నది బుల్డోజింగ్ రాజకీయమన్నారు.
తెలంగాణకు ప్రయోజ నం లేకుండా ఏకపక్షంగా బనకచర్ల కడతామంటే ఒప్పుకోబోమన్నారు. ఏపీ ఒకవైపు ప్రాజెక్టులను అడ్డుకుంటూనే మరోవైపు 968 టీఎంసీలను వ్యతిరేకిస్తోందన్నారు. సుప్రీం కోర్టుకైనా వెళ్లి తెలంగాణ హక్కులను కాపాడుకుంటామన్నారు. కట్టి తీరుతామంటే మేం అడ్డుకొని తీరుతామని.. అనుమతులు తెచ్చుడు మీకు తెలిస్తే ఆపడం మాకు తెలుసంటూ హరీశ్‌రావు స్పష్టం చేశారు.