calender_icon.png 17 July, 2025 | 12:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు విస్మరించిన కాంగ్రెస్

06-12-2024 01:19:56 AM

* ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు

విజయక్రాంతి న్యూస్ నెట్‌వర్క్, డిసెంబర్ 5: కాంగ్రెస్ పార్టీ  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పలు జిల్లాలో గురువారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల ర్యాలీలు నిర్వహించారు. భైంసాలో ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టగా పోలీసులు అనుమతి నిరాకరించి అడ్డుకున్నారు.

దీంతో బీజేపీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే రామారావుపటేల్ భైంసా రహదారిపై రాస్తా రోకో చేశారు. ఖమ్మంలో బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలో బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సహా ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుల్లారావు, మంద సరస్వతి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, బిచ్కుంద కేంద్రాల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు.