calender_icon.png 17 July, 2025 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లోకి మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే

06-12-2024 01:19:15 AM

  1. సోయం బాపురావు, ఆత్రం సక్కుకు పార్టీ కండువా కప్పిన పీసీసీ చీఫ్ 
  2. బీఆర్‌ఎస్ నుంచి ఇంకా చాలా మంది టచ్‌లో ఉన్నారన్న మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు  ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు నాయకులు కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బీజేపీ మాజీ ఎంపీ సోయం బాపురావు గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌లో చేరారు.

వీరికి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ చాలా మంది బీఆర్‌ఎస్ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని, అతి త్వరలోనే కాంగ్రెస్‌లో చేరబోతున్నారని చెప్పారు. హరీశ్‌రావు, కౌశిక్‌రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలనుకుంటే ఊరుకునేది లేదని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని హెచ్చరించారు.

రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి మార్క్ పాలనకు బీజం పడుతోందని, ప్రజల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి బీఆర్‌ఎస్ నేతలు ఓర్చు కోవడం లేదని  మండిపడ్డారు. ఒకేసారి రూ.2 లక్షల రైతు రుణమాఫీ దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని పేర్కొన్నారు.

బాపురావు, అత్రం సక్కు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పేదల కోసం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయని, తమ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ పథకాలు ఉపయోగపడుతాయని, వాటిని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు పార్టీలో చేరామని తెలిపారు. ఈ చేరికల కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు తదితరులు పాల్గొన్నారు.