calender_icon.png 2 August, 2025 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నయవంచనకు మరో పేరు కాంగ్రెస్

02-08-2025 12:15:54 AM

  1. నమ్మకద్రోహానికి మరో ఉదాహరణ ఫార్మా సిటీ
  2. మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచనకు అన్న నిజం ఫార్మాసిటీ భూముల వ్యవహారంతో మరోసారి తెలిసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శిం చారు. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేసి భూములను తిరిగి ఇస్తామని చెప్పి న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇతర అవసరాలకు వాటిని మళ్లించడం అత్యంత నీచమైన చర్య అని మండిపడ్డారు.

అధికారం ఉందన్న అహంకారంతో ప్రజల అనుమతి లేకుండా భూముల సర్వే జరపాలనుకోవడం ఫాసిస్టు చర్య అని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఫార్మా రైతులను నిలువునా ముంచి అనుముల అన్నదమ్ముల కోసమే ఫ్యూచర్ సిటీని రేవంత్ రెడ్డి నిర్మిస్తున్నాడని మండిపడ్డారు. చట్టప్రకారం భూములను తిరిగి పొందే హక్కు ఉన్న రైతులతో ప్రభు త్వం ఎందుకు చర్చించడం లేదని కేటీఆర్  ప్రశ్నించారు.

ఓవైపు ఫార్మా సిటీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించి, మరోవైపు కొనసాగిస్తామ ని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రేవంత్ ప్రభుత్వం, అటు ప్రజలను, ఇటు న్యాయస్థానాలను మోసం చేసిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. లగచర్ల గిరిజన రైతుల భూములు, కంచె గచ్చిబౌలి అటవీ భూము లు, అనుముల బ్రదర్స్ కోసం ఇప్పుడు ఫార్మాసిటీ అన్నదాతల భూములను చెరబట్టే పన్నాగాల దాకా..రేవంత్ పాపాలపుట్ట రోజురోజుకూ పెరిగిపోతుందన్నారు.

అబద్దపు హామీలివ్వడం, యథేచ్చగా చట్టాలను ఉల్లంఘించడం,  ప్రశ్నించిన వారిని వేధించడం, సిగ్గులేకుండా భూ కబ్జాలు చేయడమే మూల స్తంభాలుగా రేవంత్ ప్రభుత్వ పాలన నడుస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. అంతరించి పోయాయని అనుకున్న రాబందులు కాంగ్రెస్ నేతల రూపంలో తెలంగాణ ప్రజలను పీక్కు తింటున్నాయని చెప్పారు.