calender_icon.png 2 August, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీ భవనానికి ప్రహరీ ఏదీ ?

02-08-2025 12:16:04 AM

విద్యార్థులకు ఇబ్బందులు..పట్టించుకోని అధికారులు

మునిపల్లి, ఆగష్టు 1:  మండలంలోని చిన్నచెల్మెడ గ్రామంలోని అంగన్వాడి కేంద్రం ప్రహారీగోడ అసంపూర్తిగా నిర్మించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రహారీగోడ నిర్మాణానకి రూ.2లక్షలు ప్రభుత్వ మంజూరు చేసింది. అయితే సదరు కాంట్రాక్టర్ ప్రహరీ గోడ నిర్మాణ పనులను చేపట్టారు. అయితే నిధులు సరిపోకపోవడంతో అసంపూర్తిగా  పనులు నిలిపి వేశారు.

ప్రహారి గోడకు మొత్తం 50 మీటర్లకుగాను 27 మీటర్ల  మీటర్లు మాత్రమే పూర్తి అయింది.  మిగిలిన 23 మీటర్లకు నిధులు సరిపోక పోవడంతో అర్ధాంతరంగా పనులు ఆగిపోయాయి. దీంతో అంగన్వాడికి వెళ్లే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ప్రధాన రహదారికి ఆనుకొని అంగన్వాడీ ఉండడంతో ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా ప్రహార గోడ లేక ముందు కొంతమంది గ్రామస్తులు  కంచె మాదిరిగా జాలితో ఏర్పాటు చేసి అందులో వివిధ రకాల మొక్కలు పెంచారు. ప్రహారి గోడకు నిధులు మంజూరు కావడంతో జాలిని తీసివేశారు. దీంతో అందులో ఉన్న మొక్కలను పశువులు ఆరగిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రహారీ గౌడ నిర్మాణ పనులను పూర్తిచేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.