calender_icon.png 2 August, 2025 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందస్తు చర్యలే గొర్రెల ప్రాణాలను కాపాడుతాయి

02-08-2025 12:14:43 AM

గొర్రెలకు ఉచితంగా నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి, ఆగస్టు 1 :ముందస్తు చర్యలే గొర్రెల ప్రాణాలను కాపాడుతాయని, వ్యాధుల నివారణకు టీకాలు ప్రధాన సాధనమని  జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. శుక్రవారం సంగారెడ్డి మండల పరిధిలోని తాళ్లపల్లి  గ్రామంలో ఏర్పాటు చేసిన గొర్రెలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ  గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధి వల్ల గొర్రెల కాపరులు తీవ్రంగా నష్టపోతున్నారని.

గొర్రెలలో నీలి నాలుక వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రభుత్వం గొర్రెలకు ఉచితంగా నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నదని తెలిపారు. ఈ ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమాన్ని గొర్రెల పెంపకం దారులు వినియోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా తాళ్లపల్లి గ్రామంలో పదిమంది గొర్రెల కాపరులకు చెందిన 900 గొర్రెలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాలు వేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిణి వసంతకుమారి, పశు వైద్య శాఖ సహాయ సంచాలకులు, వైద్యులు, సిబ్బందిపాల్గొన్నారు.