21 July, 2026 | 6:40 PM

నిరుద్యోగులకు కాంగ్రెస్ మోసం

21-06-2024 01:53 AM

బీఆర్‌ఎస్ నేత రాకేష్‌రెడ్డి 

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి):  మార్పు కోసం యువత కాంగ్రెస్‌కు అధికారమిస్తే.. వారిని అరిగోస పెడుతున్నదని బీఆర్‌ఎస్ నేత ఏనుగుల రాకేష్‌రెడ్డి  ఆరోపిం చారు.  అన్నం పెట్టే వాడికి సున్నం పెట్టడం కాంగ్రెస్ డీఎన్‌ఏలో ఉందని, మార్పుకోసం ఓటేసిన పాపానికి యువతను వేధిస్తోందని మండిపడ్డారు.  కాంగ్రెస్ తీరుతో అన్ని వర్గాలు రోడ్డెక్కాయని పేర్కొన్నారు.  జాబ్ క్యాలెండర్ ఊసేలేకుండా పోయిందని, గ్రూప్ 2లో 783 పోస్టులు వేసి చేతులు దులుపుకుందని విమర్శించారు. 2 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 3లో మరో మూడు వేల ఉద్యోగాల ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పీఆర్ స్టంట్‌లలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మెగా డీఎస్సీ ద్వారా 25వేల పోస్టులు భర్తీ చేయాలని, జీవో 46 రద్దుపై వెనకడుగు వేయడం సరికాదని,  నిరుద్యోగుల సమస్యల పట్ల బీఆర్‌ఎస్ ఉడుం పట్టుతో ఉద్యమిస్తుందని హెచ్చరించారు.