22-05-2025 12:11:52 AM
- ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
- మేడిపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభం
- పాల్గొన్న కలెక్టర్, ఇంటర్ విద్యామండలి అధికారులు
జగిత్యాల, మే 21 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేం ద్రంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జగిత్లా కలెక్టర్ సత్య ప్రసా ద్ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించ డంతో పాటూ గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఉన్నత విద్యను ప్రో త్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ప్రణాళికాయుతంగా కృషి చేస్తుందన్నారు. 2025 - 26 విద్యా సంవత్సరానికి అంటే ఈ ఏడాది నుండే నూతన జూనియర్ కళాశాల ఈ ప్రాంత విద్యార్థులకు అందుబాటులోకి రానుందన్నారు.
మారు మూల ప్రాంతంలోని మే డిపల్లి, భీమారం మండలాల గ్రామీణ విద్యార్థుల సౌకర్యం కో సం ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం సం తోషకరమన్నారు. ఈ కొత్త కళాశాలలో ఈ విద్యా సంవత్సరం కోసం వెంటనే అడ్మిషన్లు తీసుకోవాలని అధ్యాపకులకు సూ చించారు. కళాశాలకు అవసరమైన కార్పస్ ఫండ్ కోసం రూ. 1 లక్ష తాను స్వయంగా అందిస్తానన్నారు. కళాశాల ఏర్పాటుకు ఒక ఎకరం భూమి రెవెన్యూ అధికారులు కేటాయించా రని, త్వరలోనే భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ కళాశాల సొంత భవన నిర్మాణం పూర్తయ్యే వరకు స్థానిక జెడ్పీస్సెస్ హైస్కూల్ బిల్డింగులో తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామన్నారు. నూతన భవనం 3 నెలల్లో పూర్తయ్యేలా చూస్తామన్నారు. స్థానిక కళాశాలలో తమ పిల్లలను చేర్పించి, కళాశాల విజయవంతంగా నడిచేట్లు స్థానికులు సహకరించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కళాశాలలో బైపిసి, సీఈసీ, హెచ్‌ఈసి కోర్సులకు ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి బి.నారాయణ మాట్లాడుతూ కళాశాల నిర్వాహకు ప్రస్తుతం ప్రిన్సిపాల్, 5గురు అధ్యాపకులు నియమించబడ్డారని, మిగతా వారిని ఈ నెల ఆఖరి వరకు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, మేడిపల్లి తహసిల్దార్ వసంత, ఎంపీడీవో, ఎంపీవో తదితరలు పాల్గొన్నారు.