calender_icon.png 22 May, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్

22-05-2025 12:09:00 AM

అనాథ యువతికి ఘనంగా వివాహం

టీఎన్జీవో సేకరించిన రూ. 61.8 వేల చెక్కు అందజేత

మానస- రాజేష్‌ల కల్యాణంలో స్థానిక ఎమ్మెల్యే ఆశీర్వాదాలు 

పెద్దపల్లి, మే21 (విజయ క్రాంతి) అనాథ యువతి పెండ్లి పెద్దగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధ్వర్యంలో బుధవారం బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని  శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో  తలపెట్టిన మానస- రాజేష్ ల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది.

తబిత బాలల సంరక్షణ సంస్థ పుత్రిక చి.ల.సౌ. యన్.మానస, రేణుక యాకయ్య ఏకైక పుత్రుడు యమ్. రాజేష్ కళ్యాణం బుధవారం  ఉదయం 11 గంటల 5 నిమిషాల సుముహూర్తం న ఘనంగా నివాళులర్పించారు.ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెలే చింతకుంట విజయరమణారావు,  డిసిపి కరుణాకర్,  అదనపు కలెక్టర్ డి.వేణు టి ఎన్ జి ఓ అధ్యక్షులు బొంకురి  శంకర్ .జిల్లా ఉన్నతాధికారులు అధికారులు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.నేడు పెళ్లి చేసుకుంటున్నా నూతన వధూవరుల కోసం జిల్లాలోని టీఎన్జీవో సంఘం సేకరించిన  రూ. 61 వేల 800  రూపాయల చెక్కును కలెక్టర్  అందించారు.