25 April, 2026 | 7:00 PM

జీఓ ప్రకారం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ జారీ: జిల్లా కలెక్టర్ హరిత

25-04-2026 05:48 PM

కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో 252 జీఓ ప్రకారం అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు అంధ జేస్తామని కలెక్టర్ హరిత అన్నారు. శనివారం సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటి సమావేశానికి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2026 సవత్సరము నకు గాను కమిటి ఆద్వర్యంలో మొదటి విడతలో 94 నూతన అక్రిడిటేషన్ కార్డులు మంజూరి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.

అక్రిడిటేషన్ కార్డుల జారి నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అక్రిడిటేషన్ కార్డు కొరకు ధరఖాస్తు చేసుకున్నవారు 252 జి ఓ లో పేర్కొన్న అవసరమైన దృవ పత్రాలను సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ ఎస్ సంపత్ కుమార్ , జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు అబ్దుల్ రహమాన్, రవి నాయక్, తుకారాం, సంతోష్, ప్రకాష్ గౌడ్, చందు, ఆబిద్ అహ్మద్, వినయ్ కుమార్, బి రాజు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.