25 April, 2026 | 7:08 PM

వైద్య సిబ్బంది ప్రదర్శన

25-04-2026 05:43 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): జాతీయ మలేరియా దినోత్సవం సందర్భంగా శనివారం ములకలపల్లి మండలలోని మంగపేట ప్రభుత్వ ఆసుపత్రి వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రదర్శన నిర్వహించారు.ములకలపల్లి మండల హెడ్ క్వార్టర్ లో సరస్వతి శిశుమందిర్ స్కూల్ నుండి సాయిబాబా టెంపుల్ వరకు ర్యాలీ కొనసాగింది. దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, మలేరియా నిర్మూలనపై నినాదాలు చేశారు. ములకలపల్లి ప్రధాన సెంటర్ నందు మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఎం.ఎల్.హెచ్.పిలు ఆశాలు, సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.