calender_icon.png 25 August, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పేదల ప్రజల పార్టీ

25-08-2025 12:00:00 AM

హైమాస్ట్ లైట్లు ప్రారంభించిన గుర్రం అంజిరెడ్డి 

సిద్ధిపేట రూరల్, ఆగస్టు 24:  కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అండగా ఉంటుందని సిద్దిపేట రూరల్ మండలం పార్టీ అధ్యక్షులు గుర్రం అంజిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే గ్రామాల అబివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక అంకంపేట సీతారాంపల్లి మాచాపూర్ గ్రామాలలో ఎస్ డి ఎఫ్ నిధుల ద్వారా ఏర్పాటుచేసిన హై మాస్ లైట్లనూ అంజిరెడ్డి  ప్రారంభించి మాట్లాడారు.

నాలుగు గ్రామాలలో రూ.26లక్షల వ్యయంతో 8 హై మాస్ లైట్లు ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులు ప్రజల అవసరాలకు చిరస్థాయిగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామా శాఖ అద్యక్షులు కిషన్, ఎరోళ్ళ బాబూ, రెడ్డి బాలయ్య, పోచంపల్లి స్వామీ, ఆయా గ్రామాల యువకులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.