24-08-2025 11:33:48 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జిల్లా కేంద్రం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2004-2006 విద్యా సంవత్సరంలో విద్యనభ్యసించిన బైపీసీ విద్యార్థులు ఆదివారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులని ఆహ్వానించి గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు నరసింహారెడ్డి, అవిలయ్య, విద్యాసాగర్ తదితరులను ఘనంగా సన్మానించారు.