calender_icon.png 11 November, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్

11-11-2025 01:13:47 AM

 గజ్వేల్, నవంబర్ 10 : కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుండే తప్ప అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని బీఆర్ ఎస్ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకులు జుబేర్ పాషా అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ నియోజకవర్గ మైనారిటీ నాయకులతో కలిసి బీఆరెస్ రాష్ట్ర మైనారిటీ సెల్ నాయకుడు జుబేర్ పాషా, పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా విలేకరులతో మాట్లాడారు.

మైనారిటీలు అంటే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ లేనిదే ముస్లిం లు లేరని సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డురంగా ఉందని రేవంత్ రెడ్డి మైనార్టీల పట్ల చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మైనారిటీల పాత్ర కీల కమైందన్నారు. గత ఆర్ బిఆర్ ఎస్ హయాంలో హోమ్ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా చే సి మైనారిటీలను గౌరవించ్చిందన్నారు.

షాదీ ముబారక్, మైనారిటీ పాఠశాలలు, స్కాలర్షిప్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను ముస్లింలకు అందించిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీదే అన్నా రు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు ఒరిగిందేమి లేదని, గొప్పలు తప్ప ఎలాంటి పథకాలను మైనారిటీల కోసం అందించలేదన్నారు. ఎంతో మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఎలాంటి అనుభవం లేని అజారుదిన్ ను మంత్రిగా చేసిందని, కేవలం జూబ్లీహిల్స్ బై ఫోల్ లో మైనారిటీల మెప్పు కోసం ఆ పార్టీ యత్నిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కాజా విరాసత్ అలీ, యూసుఫ్, మాజీ కోఆప్షన్లు ఇక్బాల్, పర్వేజ్ ఉమర్, గులాం, మాజీ ఎంపిటిసి రియాజ్,అహ్మద్, వాజిద్, జమీల్,   తదితరులున్నారు.