19-11-2025 01:49:56 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): ముదిరాజ్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముదిరాజు బిడ్డ అయినా ఎమ్మెల్యే ఒకటి శ్రీహరికి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ లో చోటు కల్పించి తగిన ప్రాధాన్యత ఇస్తోందని స్థానిక ఎమ్మెల్యే కుచ్చుకుల రాజేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ కేసరి సముద్రం చెరువులో చేప పిల్లలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముదిరాజులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా స్థానిక మత్స్యకారులు ముదిరాజులు ఆర్థికంగా ఎదుగుతారని అన్నారు. ఈ ప్రాంత ముదిరాజులు చేపలను పట్టుకుని ఇక్కడే ఉపాధి పొందాలని సూచించారు.