19-11-2025 01:30:54 PM
20 తులాల బంగారం అపహరణ
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని సాయి నగర్ లో గుర్తుతెలియని వ్యక్తులు తాళం వేసి ఉన్న ఇంట్లో చొరబడి 20 తులాల బంగారం తో పాటు నగదును దోచుకు వెళ్లిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితురాలు కవిత కూరగాయల వ్యాపారం చేసుకుంటుంది. తన కూతురి ప్రసూతి కోసం ఇంటికి తాళం వేసి వారం రోజుల క్రితం మంచిర్యాల ఆసుపత్రికి వెళ్లారు. బుధవారం ఇంటికి వచ్చిన యజమాని ఇంటి తాలం పగలగొట్టి ఉండడంతో కంగారున ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువా తలుపులు తెరిచి ఉండడం గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ బాలాజీ వరప్రసాద్ అక్కడికి చేరుకొని దొంగతనంకు సంబంధించి వివరాలను సేకరించారు. ఇంటికి తాళం వేసి ఊరు వెళ్ళేది ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సిఐ కోరారు. గుర్తుతెలియని వ్యక్తులు అనుమానస్పదంగా తిరుగుతున్నట్లు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.