19-11-2025 01:42:30 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్లా గ్రామానికి చెందిన కాదాసీ హర్షిత సిద్దిపేటలోని సురభి మెడికల్ కాలేజీలో తృతీయ సంవత్సరం ఎంబిబిఎస్ చదువుతుంది. హర్షిత తల్లిదండ్రులు నిరుపేదలు కావడం చేత బహుజన ఏకలవ్య ఫౌండేషన్ దత్తత తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థికి ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మల్లవరపు కీర్తి చంద్ర తండ్రి కీ.శే. మల్లవరపు, దాసు వర్ధంతి సందర్భంగా బహుజన ఏకలవ్య ఫౌండేషన్ నిధి నుండి రూ.6,000, సంస్థ గౌరవ అధ్యక్షురాలు వంగల సుబ్బులు రూ.4000 కలిపి మొత్తం రూ. 10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, స్కూల్ అసిస్టెంట్ మానుపాటి రాజయ్య, సహాయక కార్యదర్శి బిజిలి శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుడు లక్ష్మి టిపెట్ శ్రీనివాస్, విద్యార్థి తండ్రి కాదాసి రాజయ్య పాల్గొన్నారు.