15-07-2025 12:00:00 AM
బెంగళూరు, జూలై 14: కన్నడనాట అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి షాక్ తగి లింది. కలిబురిగి సౌత్ బ్లాక్ కాంగ్రెస్ యూ నిట్ ప్రెసిడెంట్ లింగరాజ్ కన్నిని డ్రగ్స్ పెడలింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. కొకైన్‌తో ఉన్న 120 బాటిళ్ల సిరప్‌ను అమ్ముతుండగా ఆయన్ను అరెస్ట్ చేశారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద అతనిపై కేసు నమోదు చేసినట్టు బజార్‌పేట పోలీసులు వెల్లడించా రు.
అతడు కొకైన్‌తో ఉన్న సిరప్ బాటిళ్లను ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నాడనే వివరాల గురించి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీ సులు తెలిపారు. 2023లో కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల సమయంలోనే కన్ని పార్టీలో చేరారు. అంతకు ముందు కన్ని బీజేపీలో కొనసాగారు. గతంలో ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య విషయంలో కూడా.. కన్నిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
బీదర్‌కు చెందిన కాం ట్రాక్టర్ సచిన్ 2024 డిసెంబర్‌లో బిల్లుల విడుదల గురించి ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అరెస్ట్ అయిన కన్ని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఖర్గే కన్నడ మంత్రివర్గంలో రూరల్ డెవలప్‌మెం ట్, పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రిగా ప్రియాంక్ ఖర్గే కొనసాగుతున్నారు. ప్రతిపక్ష బీజేపీ నేతలు కాంగ్రెస్ మంత్రి ప్రియాంక్ ఖర్గేపై విమర్శలు చేస్తున్నారు.