calender_icon.png 15 July, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు

15-07-2025 12:00:00 AM

  1. రెండు రాష్ట్రాలు సహా కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్ల నియామకం
  2. హర్యానాకు ఆషిమ్‌కుమార్.. లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తా
  3. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ, జూలై 14: భారత రాష్ట్రపతి ద్రౌ పదీ ముర్ము సోమవారం రెండు రాష్ట్రాలు సహా ఒక కేంద్రపాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమించారు. గోవా గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. హర్యానా గవర్నర్‌గా ప్రొఫె సర్ ఆషిమ్ కుమార్ ఘోష్, కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమించారు.

ఈ మేరకు రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు హర్యానా గవర్నర్‌గా పనిచేసిన బండారు దత్తాత్రేయ పదవీకాలం ఇటీ వల ముగిసిన సంగతి తెలిసిందే. హర్యానా కు కొత్త గవర్నర్‌గా రానున్న ఆషిమ్ కుమార్ 1944లో పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో జన్మించారు. రాజనీతి శాస్త్ర ప్రొఫెసర్‌గా చా లా ఏళ్లు విధులు నిర్వర్తించారు.

అనంతరం 1991లో బీజేపీలో చేరిన ఆషిమ్ కుమార్ ప లు రాష్ట్రాలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. లడాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియామకమైన కవీందర్ గుప్తా ఆర్‌ఎస్‌ఎస్‌లో కీలక సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2010 మధ్య జమ్మూకు మూడుసార్లు మేయర్‌గా వ్యవహరించారు. 2018లో మెహబూబా ముప్తీ క్యాబినెట్‌లో కవీందర్ గుప్తా డిప్యూటీ సీఎంగా పని చేశారు.

ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి దాకా..

విజయనగరం జిల్లా ప్రజలకు, రాష్ట్ర రా జకీయా వర్గాలకు పరిచయం అక్కర్లేని పేరు పూసపాటి అశోక్ గజపతిరాజు. విజయనరగ సంస్థాన వారసుడే అయినప్పటికీ సిస లైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొం దారు. అశోక్ గజపతిరాజు 1951 జూన్ 26న జన్మించారు. గ్వాలియర్‌లోని సింధి యా, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, విశాఖలోని ప్రభుత్వ కృష్ణా కళాశాలలో చదు వుకున్నారు.

1978లో మొట్టమొదటిసారిగా జనతా పార్టీ తరఫున విజయ నగరం అసెం బ్లీ స్థానం నుంచి పోటీ చేసిన అశోక్ గజపతిరాజు.. 1982లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీ లో కీలక నాయకుడిగా పేరు పొందిన అశోక్ గజపతిరాజు టీడీపీ నుంచి ఆరుసార్లు (1983, 1985, 1989, 1994, 1999, 2009)ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా (2014) విజయం సాధించారు.

2014లో కేంద్ర ప్రభుత్వంలో పౌరవిమానయానశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఎక్సైజ్, వాణిజ్య, తదితర శాఖల మంత్రిగా సేవలం దించారు. ప్రస్తుతం ఆయన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు.