15-07-2025 12:11:49 AM
పుతిన్‌కు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్, జూలై 14: అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రష్యాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే 50 రో జుల్లో ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటా యన్నారు. సోమవారం వైట్‌హౌస్‌లో మీడియాతో ట్రంప్ మాట్లాడు తూ.. ‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆ పేందుకు 50 రోజులు గడువు ఇస్తు న్నా. యుద్ధం ఆపకపోతే 100 శాతం సుంకాలు విధిస్తాం.’ అని హెచ్చరించారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం విష యంలో ట్రంప్ మొదటి నుంచి పుతిన్ వైఖరిని విమర్శిస్తూ వస్తున్నా రు. ఇప్పటికే రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తానని హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా రష్యా సోమవారం కూడా ఉక్రెయిన్‌పై మిసైల్స్ తో విరుచుకుపడింది.