calender_icon.png 7 January, 2026 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షబ్బీర్ అలీని సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

05-01-2026 12:00:00 AM

కామారెడ్డి అర్బన్, జనవరి 4 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం శాలువాతో ఆదివారం కాంగ్రెస్ నాయకులు సన్మానం చేశారు. కాంగ్రెస్ నాయకులు దోమకొండ మాజీ జడ్పీటీసీ తీగల తిరుమల గౌడ్, దోమకొండ మండల కాంగ్రెస్ అధ్యక్షులు అనంతరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి తాటిపల్లిశ్రీకాంత్, యాత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆశబోయిన శ్రీనివాస్ ,మాజీ ఎంపిటిసి నల్లపు శ్రీనివాస్,  సీనియర్ నాయకులు అండెంశంకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.