29-08-2025 09:04:12 PM
వలిగొండ,(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా విడుదలయిందని వెంటనే పరిశీలించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాలతో శుక్రవారం వలిగొండ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ నేతలు ఓటర్ జాబితాను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకే కుటుంబంలోని ఓట్లు అన్ని ఒకే వార్డులో ఉన్నాయో లేదో పరిశీలిస్తున్నామని లేని పక్షంలో అభ్యంతరాల ద్వారా సరి చేయించేందుకు కృషి చేస్తామన్నారు. ఓటర్లు కూడా తమ కోట్లను తమ వార్డులో ఉన్నాయో లేదో చూసుకొని అభ్యంతరం ఈనెల 30వ తేదీ వరకు తెలియజేయాలని సవరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కొండూరు భాస్కర్, ఎండి కాసిం, కొండూరు సాయి, బాలు తదితరులు పాల్గొన్నారు.