calender_icon.png 30 August, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణపతి ప్రతిమ కోసం వెళ్లి మూడు రోజులుగా అక్కడే ఉన్నారు

29-08-2025 11:16:53 PM

ఉదృతంగా ప్రవహించిన భారీ వరదకు వంతెన ఇరువైపులా కొట్టుక పోవడంతో ఆ గ్రామంలోని నిలిచిపోయారు 

ఎట్టకేలకు పారా మిలిటరీ రెస్క్యూ సిబ్బందితో ఇవతల గట్టుకు చేరారు

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లి కలాన్ గ్రామానికి చెందిన యువకులు ఆరుగురు వినాయక చవితి సందర్భంగా వినాయక ప్రతిమ కొరకు నాలుగు రోజుల క్రితం మెదక్ ఎప్పటిలాగే వెళ్లారు. గత మూడు రోజులుగా భారీగా కురిసిన వర్షాలకు భారీ వరద రావడంతో పోచంరాల గ్రామంలోని ఆరుగురు యువకులు మూడు రోజులుగా ఉండిపోయారు.

యువకుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందడంతో విషయం తెలుసుకున్న నాగిరెడ్డిపేట పోలీస్ మరియు పారా మిలిటరీ సిబ్బంది సహాయంతో ఆరుగురు యువకులను మెదక్ ఎల్లారెడ్డి ప్రధాన రహదారి వంతెన ఇరువైపులా తెగిపోవడంతో, భారీ వరద రావడంతో వరదలో నుండి ఆ యువకులను పారా మిలిటరీ సిబ్బంది వరదలో నుండి ఆరుగురిని మెదక్ వైట్ నుండి గోపాల్పేట వైపు తరలించారు. దాంతో ఆ యువకుల కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.