29-08-2025 10:55:16 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం, ఆగస్ట్ 29 (విజయ క్రాంతి): ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిరుమలాపురం, అనంతసాగర్ గ్రామాల్లో ఏసీబీ ఉమ్మడి ఖమ్మం జిల్లా డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో వరంగల్ కు చెందిన ఎమ్మార్వో బండి నాగేశ్వరరావు ఇళ్లలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సోదాలు నిర్వహించారు. అందిన సమాచారం ప్రకారం వరంగల్ కిల్లా ఎమ్మార్వో గా పనిచేస్తున్న బండి నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు వరంగల్ లోని అయన కార్యాలయం, ఇంట్లో, ఖమ్మం జిల్లా చింతకాని మండలం తిరుమలాపురం గ్రామంలోని ఆయన సోదరుడి ఇంట్లో, అనంతసాగర్ గ్రామంలోని ఆయన సోదరుడి కోళ్ల ఫారం లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. తిరుమలాపురం, అనంతసాగర్ గ్రామాల్లో ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో 12 మంది అధికారులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సోదాలు నిర్వహించారు. ఐదున్నార ఎకరాల భూమి డాకుమెంట్లు ఏసీబీ అధికారులకు దొరికినట్టు సమాచారం. ఏసీబీ అధికారుల దాడులు గురించి చింతకాని మండలం లో తెలియడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.