29-08-2025 09:07:46 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని పవిత్రాత్మ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా గిడుగు వెంకట రామమూర్తి పంతులు చిత్రపటానికి పూలమాలలు సమర్పించారు. విద్యార్థిని, విద్యార్థులు వివిధ రకాల కవితలు, నినాదాలు, సూక్తులు, పాటలు నృత్యాలతో అలరింపజేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సవిత గారు మాట్లాడుతూ... గిడుగు వెంకట రామమూర్తి పంతులు తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడని, గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని అందించిన గొప్ప పితామహుడని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.