29-08-2025 10:59:22 PM
జిన్నారం/ గుమ్మడిదల(విజయక్రాంతి): జిన్నారం, గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని అల్లినగర్ గ్రామంలోని 27 సర్వేనెంబర్ లో పరిశ్రమల ఏర్పాటు కోసం కొంతమంది పారిశ్రామిక వేత్తలు దరఖాస్తు చేసుకోవడంతో ఆ భూమిని జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి పరిశీలించారు. నల్తూర్ గ్రామంలోని 159 సర్వే నంబర్ లో 25 ఎకరాల భూమిని నవోదయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు కేటాయించారు. ఈ భూమిని కూడా అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు.ఈ ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దేవదాస్, ఆర్ఐ జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు.