calender_icon.png 10 January, 2026 | 9:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఇలాకలో కాంగ్రెస్ నాయకుల విజయం

08-01-2026 01:32:00 AM

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌కే సాధ్యం 

ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం 

మెదక్ పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు 

మనోహరాబాద్, జనవరి 7: బిఆర్‌ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇలాక గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో సర్పంచులుగా గెలవడం అభినందనీయమని మెదక్ పార్లమెంట్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు అన్నారు. బుధవారం సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు మన్నే కళ్యాణ్, గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జి నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు నీలం మధు ను కలిశారు.

గెలుపొందిన సర్పంచ్లను అభినందించి, సన్మానించిన నీలం మధు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని బిఆర్‌ఎస్ కేసీఆర్ ఇలాకలో కాంగ్రెస్ పార్టీ నాయకులను సర్పంచులుగా గెలిపించారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని అభివృద్ధి చేసి నిలబెట్టుకుంటామని వెల్లడించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు భాస్కర్ యాదవ్, నరసన్నగారి కృష్ణ, నాగరాజు, నూకల రాము, వెంకటేష్, ఎర్ర నాగరాజు పాల్గొన్నారు.