calender_icon.png 10 January, 2026 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ బాకీ కార్డును ఆవిష్కరించిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్

08-01-2026 01:32:15 AM

హన్వాడ, జనవరి 7: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్  బాకీ కార్డులంటూ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా విఫలమైనదని, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి/షాది ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, విద్యార్థులకు స్కూటీలు, రైతులకు రైతు భరోసా సహాయం మరియు రుణమాఫీ చేయకుండా ప్రజలకు బాకీ పడిందన్నారు, ఈ బాకీలు ఎప్పుడూ చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.