కులంపై విచారణకు సిద్ధం
రాజకీయ లబ్ధికోసమే కుల ప్రస్తావన
40 ఏళ్లుగా మా నాన్న ఎస్సీ సర్టిఫికెట్‌తో ప్రజాప్రతినిధిగా ఉన్నారు
ఎంపీగా ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా
మీట్‌ది ప్రెస్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కావ్య
హనుమకొండ, మే 9 (విజయక్రాంతి): ‘మా నాన్న నలభై ఏళ్లుగా ఎస్సీ సర్టిఫికెట్‌తో నే ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవలందిస్తున్నారు. గత ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఏనా డు అభ్యంతరం చెప్పలేదు. ఈ ఎన్నికల్లో కొందరు పదేపదే కులం ప్రస్తావన తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నా రు. జాతీయ స్థాయి కమీషన్ కాదు.. ఏ కమిటీతో విచారణ చేయించిన తాము సిద్ధంగా ఉన్నాం’ అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య స్పష్టం చేశారు. హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆమె మాట్లాడారు. గత పదేళ్లుగా కడియం ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు.
మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనే సదుద్దేశంతో రాజకీయాల్లో వచ్చినట్టు చెప్పారు. దళిత మహిళగా, వైద్యురాలి గా, సమాజ సేవకురాలిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో ఎన్నికల బరిలో నిలిచినట్టు ఉద్ఘాటించారు. వరంగల్ పార్లమెంట్ ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి పనిలో ప్రజలను భాగస్వామ్యం చేసి పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తానని చెప్పారు. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి నేషనల్ హైవేను ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటించి సబ్బిడీల ద్వారా పరిశ్రమల స్థాపనకు తోడ్పడతానని తెలిపారు. రైతుల పంటలకు నీళ్లు అందించేందకు ప్రత్యేక చొరవ చూపుతానని చెప్పారు. కాకతీయ కాలం నాటి గొలుసుకట్టు చెరువుల ద్వారా వరంగల్ పార్లమెంట్‌లోని ప్రతి గ్రామాన్ని సస్యశ్యామలం చేసే అవకాశం ఉందన్నారు. దేవాదుల మూడో దశ పనులతోపాటు కాల్వలకు మరమ్మతులు చేసి ప్రతి ఎకరాకు నీరు అందించే కార్యక్రమం చేపడతానని వెల్లడించారు.
కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా చేస్తా
కాజీపేట జంక్షన్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కడియం కావ్య హామీ ఇచ్చారు. విభజన చట్టంలో పొందుపరిచిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాట్లు చర్యలు చేపడతానని స్పష్టంచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి వరంగల్ అభివృద్ధికి సరైన నిధులు తీసుకోస్తానని చెప్పారు. స్థానిక ప్రజలకు విద్యావైద్యం, సంక్షేమం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
బీసీలకు అండగా కాంగ్రెస్: కడియం కావ్య
కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అండగా ఉంటుందని వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య స్పష్టం చేశారు. కాజీపేట ఫాతిమానగర్‌లోని వైష్ణవి గ్రాండ్‌హోటల్‌లో గురువారం నిర్వహించిన బీసీల అత్మీయ సమ్మేళనంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడు తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తుందన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి దేశ ప్రజల స్థితిగతులు, వారి జీవన విధా3నాలు పరిశీలించారని తెలిపారు. కేంద్రంలో కాంగ్రె స్ అధికారంలోకి రాగానే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పారు. దేశ సంపాదను బీజేపీ ప్రభుత్వం కొంతమందికే పంచి పెడుతోందని ఆమె ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లు తొలగించాలని కుట్రలు చేస్తోందన్నా రు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బైరి రవికృష్ణగౌడ్, ఉమ్మడి వరంగల్ బీసీ నాయకు లు పాల్గొన్నారు.






